సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న కల్కి సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కర్ణుడు గా సింహ గర్జన చెయ్యడం, ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరామ చంద్రుడు గా వారణాశి సినిమాలో పురాణ.. చారిత్రక పాత్రలో కన్పిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో జూ ఎన్టీఆర్ కుమార స్వామి పాత్రలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు పురాణ హీరోల పాత్రలకు పాన్ ఇండియాలో డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా సుక్రుమార్ దర్శకత్వంలో పురాణ పురుషుడుగా కనిపించనున్నారు అని ఫిల్మ్ వర్గాల టాక్. రంగస్థలం’.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ‘మళ్లీ వీరిద్దరి కలయికలో రాబోతున్న ప్రాజెక్ట్ ‘RC 17’. ముఖ్యంగా ‘పుష్ప 2’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరణ్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో..ఒక సాలిడ్ కథను మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌ కావడం వల్ల కొత్త రకమైన మ్యూజిక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారట. అందుకే కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్, రుక్మిణి వసంత్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఎందరో అగ్ర నటులు కీలక పాత్రలలో నటించనున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఒక విజువల్ వండర్‌గా నిర్మించనున్నాయి. ఇక దసరా పండుగ కానుకగా ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుందని తాజా సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *