సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వర్షాకాలం ముగిసిపోతున్నప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవకపోవడం భానుడు ప్రచండంగా చెలరేగిపోతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని మరియు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు కమీషనరు, AP దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు పశ్చిమ గోదావరిజిల్లా నందలి ప్రముఖ దేవాలయములందు నేడు, మంగళవారం ది.06.10.2026 తేదీ ఉదయం వరుణ యాగం, వరుణ జపం మరియు శివాలయములలో నహస్ర ఘటాభిషేకం నిర్వహించవలసినదిగా ఆదేశించియున్నారు.ఈ నేపథ్యంలో కాళ్ళకూరు స్వయం భువుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో, పంచారామములో రాష్ట్రంలోసమృద్ధిగా వర్షాలు కురవాలనే సత్సంకల్పంతో వరుణ మంత్ర జపాన్ని నిర్వహించారు మూడు రోజులపాటు జరిగే వరుణ మంత్ర జపం పూజ కార్యక్రమం లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, నసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఉపాధ్యాయుల MLC బొర్రా గోపి మూర్తి, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
