సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో ‘సేవా జ్యోతి యాత్ర’ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి యాత్రను ప్రారంభించారు. స్థానిక ఎస్.ఆర్.కె.ఆర్. కళాశాల వద్ద ప్రారంభమైన యాత్రలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సేవా జ్యోతిని వెలిగించి, కాగడా చేతబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సాగిన యాత్ర ,,గతంలో ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ కాంస్య విగ్రహం వరకు కొనసాగింది. ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకుని నిలుస్తోందని, 2047 నాటికి భారత్‌ను ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో యువత, విద్యార్థులు, ప్రతి పౌరుడు తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.
