సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నేడు, బుధవారం ఉదయం దేవాలయ అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి భక్తుల కానుకల ఆదాయం లెక్కించారు మొత్తం 40 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.33,27,757.- ముప్పై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు లభించగా విదేశి కరెన్సీ U S A 50 డాలర్స్, సింగపూర్ 2 డాలర్స్, మలేషియా 5 నగరాస్, UAE 10 దిర్హామ్స్ మరియు బంగారం 35 గ్రాములు 200 మిల్లీగ్రాములు, వెండీ 144 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు, మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు,యండా సత్యవతి, పాపోలు ఏడుకొండలు, దేవదాయ ధర్మదాయ శాఖ భీమవరం తనిఖీదారు Ps సాయికుమారి మరియు భీమవరం యూనియన్ బ్యాంకు సిబ్బంది, పాల్గొన్నారు.
