సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 22వ నుంచి 26వ తేదీన వరకు భీమవరంపట్టణ శివారులో ఉన్న చిన అమిరం గ్రామంలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే నివాసం వద్ద నేడు బుధవారం కంటి వైద్య శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించారు. గొట్టుముక్కల వెంకటరాజు (తాతారాజు) జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు, శంకర నేత్రాలయ కంటి వైద్య శాల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
