సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం మండలంలోని తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యల తిప్ప, కోమటితిప్ప నార్త్, రామాయణం పురం, దిరుసుమర్రు, యనమదుర్రు గ్రామంలో పల్లె పండగ 3.0 లో భాగంగా పలు రోడ్లకు శంకుస్థాపనలు, పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు , టీడీపీ సీనియర్ నేత మెంట్ పార్ధ సారధి కూటమి నేతలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
