సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నట విశ్వ నాయకుడు కమల్ హాసన్, ఒకనాటి స్టార్ డైరెక్టర్ శంకర్, కాంబోలో తాజగా షూటింగ్ ప్రారంభమైన చిత్రం ‘భారతీయుడు -3’. 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీకి స్వీకెల్‌గా భారతీయుడు-2, ను గత 2024 లో విడుదల చెయ్యగా అది ఘోర పరాజయం చవి చూడటంతో అప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తీ చేసుకొన్న భారతీయుడు – 3 రిలీజ్ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఒక దశలో దానిని థియేటర్స్ లో కాకుండా ఓటిటి డిజిటల్ స్ట్రీమింగ్? చేస్తారని వార్తలు వచ్చాయి.అయితే ఆగిపోయిన ఆ సినిమాను కమల్, శంకర్ కాంబోలో రూపొందించటానికి లైకా సంస్థ మరల సిద్ధమైంది. భారతీయుడు 2 కి కొనసాగింపుగా ‘భారతీయుడు-3 కి కావలసిన కేవలం 10 రోజుల షూటింగ్ తిరిగి ఈనెలలో ప్రారంభిస్తున్నారు.. .ఇప్పటికే ‘భారతీయుడు3’కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై వేగంగా వెళుతుంటే దుమ్ము, దూళి రేగుతున్నట్టుగా ఉండే ఫొటో బాగా వైరల్ అవుతుంది. భారతీయుడు 3′ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ‘భారతీయుడు 2’ క్లైమాక్స్‌లో చూపించారు. . ‘భారతీయుడు 3’లో ఎస్.జె. సూర్య, ప్రియ భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
