సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోచంద్రబాబు సర్కార్ కు సుప్రీం కోర్ట్ లో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ను నేడు, శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో బీసీ రిజర్వేషన్లపై తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది
