సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, విజయవాడ డివిజన్ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోంకియాతో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రతిపాదనలు, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాల్సిన అవసరంపై వారితో చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించే అంశంపై జాప్యం జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో స్వయంగా చర్చించి వందేభారత్, గరీబ్ రథ్ రైళ్లకు త్వరలో హాల్ట్ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి నుంచి వారణాసికి వెళ్లేలా ప్రతిపాదించిన కొత్త రైలును తాడేపల్లిగూడెం మీదుగా నడిపించాలని రైల్వే అధికారులకు ప్రతిపాదనలుఇచ్చానని అన్నారు. విశాఖపట్నం నుంచి వారణాసికి వెళ్లే రైలును నరసాపురం వరకు పొడిగించాలని, నరసాపురం నుంచి భీమవరం మీదుగా విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీసు నడపాలని కోరినట్లు ఆయన చెప్పారు. అలాగే నరసాపురం నుంచి భీమవరం మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై)వెళ్లే రైలును ప్రతిరోజూ నడిపేలా కూడా ప్రతిపాదించినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *