సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా సమాచారం ప్రకారం, వారణాసి కోసం 2ఏళ్ళు కేటాయించిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన తదుపరి సినిమా కోసం లెక్కల మాస్టారు సుకుమార్ తో చేతులు కలిపాడని ఫిల్మ్ నగర్ టాక్.. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే మంచి సినిమా అయినప్పటికీ , అమెరికా , యూకే లలో కోట్ల కలెక్షన్స్ సాధించినప్పటికీ,ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. తరువాత ‘పుష్ప’ కధ మహేష్ బాబు కోసమే తయారు చేసారు సుకుమార్. అయితే మహేష్ రిస్క్ అని ఒప్పుకోలేదు. అయితే ఎప్పటి నుంచో సుకుమార్ మహేశ్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కలలు కంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ పూర్తీ చేసుకొన్నా మహేష్ బాబు తో సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కధ చర్చలు సాగుతున్నాయని, 2027 మే చివరి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఆ తదుపరి సినిమా కోసం ‘సందీప్ వంగ’ కూడా కర్చీఫ్ వేశారని టాలీవుడ్ టాక్ ..
