సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్నికలలో ‘ఓటు చోర్, సర్ లో రాజ్యాంగ ఉల్లంఘన చేసారు. అన్న ఆరోపణలు తో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ CJP తలపెట్టిన జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం దానిపై ఉక్కుపాదం మోపింది. సుమారు 25 వేలమంది పోలీసు, కేంద్ర బలగాల మోహరింపు తో ఢిల్లీ సరిహద్దులు లోని కీలక ప్రాంతాలు రోడ్లు పూర్తిగా యుద్ధరంగంలా మారాయి. ఆందోళనకారులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు కేవలం బారికేడ్లే కాకుండా, అత్యంత కఠినమైన భద్రతా చర్యగా స్పైక్ స్ట్రిప్స్‌ను (Spike Strips) రంగంలోకి దించారు మోహన్ ఎస్టేట్ ప్రాంతంలో బారికేడ్లతో పాటు టైర్లు పంక్చర్ చేసే స్పైక్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేశారు.సౌత్-ఈస్ట్ ఢిల్లీలో రోడ్లపై మేకులు ఉండే స్పైక్ స్ట్రిప్స్‌ను అమర్చారు. ఉద్యమం పేరుతొ విద్యార్థుల మధ్యకు అరాచక శక్తులు ప్రవేశించకుండానిఘా పెంచారు. నేడు శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుండి రావాల్సిన 250కి పైగా రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాలలో ఇంటర్ నెట్ నిలిపివేశారు. నగరంలో మెట్రో స్టేషన్లు బంద్, వందలాది రైళ్లు రద్దు అయ్యాయికాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన విమానంలో ఉండగానే ఢిల్లీ పోలీసుల బృందం లోపలికి ప్రవేశించి అదుపులోకి తీసుకుంది ఆయనతో పాటు వందలాది సీజేపీ సభ్యులు నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్న సింగ్‌లనుఅదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
