సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో మునిసిపల్ ఇతర స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం లభించింది. పట్టణాల్లో బీసీల జనాభా శాతం బాగా పెరిగిందని.. ఎన్టీఆర్ సమయంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఇప్పుడు కూడా అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో 34 శాతం బీసీలకు ఇచ్చారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాయని విమర్శించారు.ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందన్న సీఎం.. నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని మంత్రులకు సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తుంటే.. అది అమలుకాకుండా వైసీపీ వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు ఇప్పుడు సర్ తర్వాత వచ్చే ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు.
