సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నాయీబ్రాహ్మణుల కులవృత్తిని పరిరక్షించాలని, కార్పొరేట్ సెలూన్లకు సంబంధించిన తమసమస్యలను పరిష్కరించాలని భీమవరం నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేపాడ పెద్దిరాజు, కోడూరి రామకృష్ణ కోరారు. ఎమ్మెల్యే కార్యాలయంలో భీమవరం నాయీబ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు నేడు, శనివారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ భీమవరం ప్రాంతంలో నాయీబ్రాహ్మణులు తరతరాలుగా తమ కులవృత్తినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు సెలూన్లు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుండి నాయీబ్రాహ్మణ కులానికి చెందని వ్యక్తులను పనివారిగా తీసుకువచ్చి ఈ వృత్తిలోకి ప్రవేశించడంతో తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న తమ నాయీబ్రాహ్మణ కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందన్నారు. నాయీబ్రాహ్మణుల సంప్రదాయ వృత్తిని పరిరక్షించేందుకు నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని, కార్పొరేట్ సెలూన్లకు అనుమతులు ఇచ్చే విషయంలో నాయీబ్రాహ్మణుల జీవనోపాధి, వృత్తి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.అసెంబ్లీలో మా సమస్యలపై మాట్లాడి తగిన చర్యలకు సహకరించాలని వారు కోరారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ సారిక కనకదుర్గారావు, తదితరులు పాల్గొన్నారు
