సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కి అనుకూలంగా సర్ తో రాజ్యాంగ ఉల్లంఘన కు పాలబడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతియా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ సంపూర్ణ నియంతృత్వ పాలనలో మనం జీవిస్తున్నాం. ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణంగా లేదు. ఇది ఎమర్జెన్సీని మించినది. రైళ్లను, మెట్రోలను, రోడ్డు మార్గాలను నిలిపివేశారు. కాగా.. విమానంలో సీజేపీ నేతలు వస్తే.. విమానం దిగడంతోనే వారిని అరెస్ట్ చేయడం నిజంగా భయాన్ని కలిగిస్తోంది. మోదీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ‘ప్రధాని మోదీకి తాను దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలిచానని’ స్పష్టంగా తెలుసు.. అందుకే ఈ ఉద్యమాన్ని అణచివేసి తన మోసం బయటపడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు
