సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఇండి కూటమి’ నేతలు సుప్రీం కోర్టు వరకూ ఓటు చోర్, సర్ నిలిపివేయాలని నినాదాలతో ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో నేడు, సోమవారం ప్రభుత్వ ఆదేశాలతో ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్లు మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్, జన్​‌పథ్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఈరోజు (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ నిలిపివేత కోరుతూ ఈ నేతలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం అందించనున్నారు. ఇందుకోసం తమకు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో సమయమివ్వాలని సీజేఐను కాంగ్రెస్ నాయకులు కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని.. ఈ అంశాలు ప్రస్తుతం సుప్రీం విచారణ పరిధిలోనే ఉండటంతో మీతో సమావేసం కాలేనని సీజేఐ తాజాగా.. సున్నితంగా తిరస్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *