సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను గత బుధవారం భీమవరం నియోజకవర్గంలో వాడవాడలా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా పట్టణంలో లేన్నప్పటికీ, ఏ రాజకీయ పార్టీకి చెందకుండా రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నప్పటికీ వాటికీ అతీతంగా ఆయన అభిమానులు మాత్రం ఏ మాత్రం జోష్ తగ్గలేదు. ప్రధాన సెంటర్స్ లో భారీ ఫ్లెక్సీ లు, రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీ లు కట్టారు. అభిమానులు చేస్తున్న దాదాపు అన్ని సేవ కార్యక్రమాలలో గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ పాల్గొన్నారు. తాడేరు లో రక్త దానం శిబిరం ఏర్పాటు తో పాటువృద్ధులకు భోజనాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పలు చోట్ల అన్నసమరధనలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రంధి రవితేజ మాట్లాడుతూ.. తన తండ్రి గ్రంధి శ్రీనివాస్ ఎంతో ప్రజాభిమానాన్ని సంపాదించు కున్నారని, పదవి ఉన్న లేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో ఆనందం ఉంటుందని మాకు చెప్పేవారని అన్నారు. ఈ కార్యక్రమలలో తోట బోగయ్య,తమరి శరత్ ,వెదురుపర్తి అరుణ్ కుమార్, చలపాక కృష్ణ భవాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *