సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు, శుక్రవారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణగా భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్న బెంగుళూరుకి చెందిన యేలూరి వినోద్ భక్త కిరణ్మయి 50,000 రూపాయలు కానుకగా అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ ఆశీర్వచనం అందచేసారు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ ఉదిసి మీనాక్షి అతికెల ఆంజనేయ ప్రసాద్ గుసిడి నాగ శిరీష మల్లువలస లక్ష్మి నిర్మల పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు
