సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తదితర కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.. అయితే ఏలూరు మేయర్ అభ్యర్థిగా జనసేన కు ఇవ్వడం తో స్థానిక తెలుగు దేశం పార్టీ క్యాడర్ రాజానామాలు సిద్ధం చేసి అదిష్టానం కు ఝలక్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒకటి రెండు రోజులలో అన్ని సర్దుబాటు అవుతాయని జనసేన అభ్యర్థి ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున కంటమణి విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
