సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్‌ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌ . సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit) విడుదల తేదీ ఖరారైంది. గతంలో ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు డేట్ మారింది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రకటించారు. దీనితో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ పౌజి మరియు కల్కి2 సినిమాలు రిలీజ్ కు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆలస్యం తప్పడం లేదు.. ఈ మేరకు కొత్త విడుదల తేదీని వెల్లడిస్తూ సినిమా బృందం అప్‌డేట్‌ ఇచ్చింది. అర్జున్‌ రెడ్డి’, యానిమల్‌’ వంటి చిత్రాలతో తనదైన మేకింగ్‌ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌, సీనియర్ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *