సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. విక్టరీ వెంకటేష్, ‘బ్భీమవరం బ్రాండ్’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’…AK47 నిజానికి ఈ దసరాకు విడుదల కావలసిన సినిమా.. అయితే మరల కొన్ని సన్నివేశాలు రి ఎడిటింగ్ తో పాటు సినిమా నేపధ్య సంగీతం తిరిగి రికార్డింగ్ చెయ్యాలని, సినిమాకు భారీ ప్రమోషన్ చెయ్యాలని భావించిన హీరో వెంకటేష్, మేకర్స్ మరి కొద్దీ కాలం రిలీజ్ ను వాయిదా వేశారు.ఈ చిత్రం అక్టోబరు 30న కచ్చితంగా థియేటర్లలో సందడి చేయడం ఖాయమని మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ‘విజయదశమి కానుకగా మాలా’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటలో వెంకీ సరసన నివేదా పేతురాజ్ తన అందచందాలతో ఉరిస్తున్నారు. . మరెందుకు ఆలస్యం.. ఈ పాటను మీరూ చూసేయండి.
