సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సినిమా రిలీజ్ కు ఏ సినిమా వేడుక నిర్వహించిన ఆ సినిమా ఘన విజయం సాదిస్తుందని టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే వరుస ప్లాఫ్ లలో ఉన్న హీరో రవితేజ సైతం ఏరికోరి ‘ఇరుముడి” సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్ భీమవరంలో నిర్వహించారు. మరి భీమవరం కు చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , హీరో విక్టరీ వెంకటేష్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 (AK47) కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుక భీమవరంలో రేపు గురువారం ..అంటే అక్టోబర్ 22 న జరగనుంది అని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇంకా వేదిక ఫైనల్ కాలేదు. అలాగే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 26 న తిరుపతిలో జరగనుంది. మొత్తానికి పలుసారులు విడుదల వాయిదా పడిన ఆదర్శ కుటుంబం ఈ నెల 30న కచ్చితం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించడానికి ‘త్రివిక్రమ్’ సొంత గడ్డ భీమవరం సెంటిమెంట్ మంచి పాజిటివ్ బూస్ట్ ఇవ్వనుంది.
