సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, వాసు, సినిమాల తరువాత అగ్ర హీరో వెంకటేశ్, భీమవరం బ్రాండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి దర్శకుడిగా కలిసి చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సినిమా కథ, విషయానికి వస్తే.. చిట్టి బాబు (వెంకటేశ్‌) మధ్యతరగతి మనిషి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చేసిన తప్పులకు, కూతురు సంపూర్ణ (యువినా) చదువుకు, కొడుకు సర్వ (రాజ్‌ ప్రజ్వల్‌) ఆరోగ్యానికి అప్పులు చేసి తీర్చలేక సతమతమౌతుంటాడు. అప్పుడే అతని ఉద్యోగమూ పోతుంది. ఈ కష్టకాలంలో అతను కొన్న లాటరీ టిక్కెట్‌కు వంద కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ అవుతుంది. నెల రోజుల్లో చిట్టిబాబుకు వంద కోట్లు వస్తాయనే నమ్మకంతో రియల్ ఎస్టేట్‌ కు చెందిన బుజ్జిబాబు (రఘుబాబు) అతనికి ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండటానికి విల్లా ఇచ్చేస్తాడు.చిట్టిబాబుకు వందకోట్లు లాటరీలో వచ్చిందని తెలిసి, బీహార్ కు చెందిన ఓ దోపిడీ ముఠా వీళ్ళ మీ కన్నేస్తుంది. లాటరీ డబ్బులు చిట్టిబాబు ఇంటికి తీసుకొచ్చిన రాత్రే ఆ ముఠా సభ్యులు చిట్టిబాబు ఇంటిపై దాడి చేస్తారు. కానీ ఊహించని విధంగా చిట్టిబాబు ఫ్యామిలీ చేతిలో దోపిడీకి వచ్చిన ఆరుగురు చనిపోతారు. అక్కడ నుండి సినిమా అనేక ట్విస్ట్ లతో మలుపులు తిరుగుతుంది. ఇక సినిమాకి వెంకిమామ మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. కామిడి, సహజ నటన కొట్టిన పిండే యాక్షన్ లో మాత్రం మరోసారి శత్రువు సినిమా గుర్తుకు తెచ్చాడు. త్రివిక్రమ్ మాటలకూ వెంకీ టైమింగ్,వెటకారం జోడిస్తే .. ఆ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. మెయిన్ రోల్ లో నారా రోహిత్ , సత్య ఇక మిగతా నటీనటులు అందరు ఓకే.. ఇక గురూజీ త్రివిక్రమ్ తన సూపర్ పంచ్ డైలాగ్స్ తో మరోసారి నిరూపించుకొన్నారు. దీనితో భారీ క్రైమ్ కలపి కొత్త ట్రాక్ లో సినిమా చక్కగా తీశారు.. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ ‘చాల బాగుంది’ సెంకండ్ హాఫ్ ‘బాగుంది’. అంతే తేడా.. తమన్ సంగీతం ఇచ్చిన పాటలు కన్నా బ్యాంకు గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ఇంటర్ వెల్ కు ముందు 20 నిముషాలు సినిమాకు పెద్ద హైలైట్..కుటుంబ సమేతంగా చూసే క్రైమ్ సినిమా ఈ ఆదర్శ కుటుంబం AK 47..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *