సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లాలోని కేవలం నరసాపురం ,ఆకివీడు మునిసిపాలిటీలతో పాటు, ఏలూరు జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగా రెడ్డిగూడెం,మునిసిపాలిటీ లకు నేటి ఆదివారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమయ్యింది ప్రజలు తమ ఓటు హక్కును ఉదయం 7 గంటల నుండి భారీ క్యూ లైన్ లలో నిలబడి ఉపయోగించు కొంటున్నారు ఇప్పటికే 40 శాతం ఓటింగ్ పూర్తీ అయ్యింది. కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం వర్షం పడుతున్నప్పటికీ మరింత ఓటింగ్ పెరిగి 75 శాతం ఓటింగ్ వస్తుందని విశ్లేషణ. ఇక చిన్న చిన్న వివాదాలు ఉన్నపటికీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బ్యాలెట్‌ బాక్సులు తడిసిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌, ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం చాల జాగ్రత్తగా బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రత పరచాలని, జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *