సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు ధన త్రయోదశి సందర్భంగా రేపు అంటే 06.11.2026 శుక్రవారం సాయంత్ర 7.00 గంటలకు మహా లక్ష్మీ దేవి ధన పూజ , ధన్వంతరి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేపటి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం గం 4.00 వరకు శ్రీ అమ్మవారి ఆలయం ప్రాంగణoలోప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అయ్యగారి శ్రీ రామ్ గారి ఆద్వర్యములో ఉచిత ఆయుర్వేద చికిత్స శిబిరం నిర్వహించబడునని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా . శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కు భీమవరం కి చెందిన తటవర్తి రవీంద్ర మోహన్ ప్రత్యూష దంపతులు 8 గ్రాముల బంగారం మరియు మార్టేరుకు కి చెందిన వెలగల భగవాన్ రెడ్డి చంద్రకళ దంపతులు 4 గ్రాముల బంగారం మరియు తణుకు కి చెందిన పడాల వెంకటరెడ్డి ప్రియాంక దంపతులు 4 గ్రాముల బంగారంకానుకగా సమర్పించారు ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్య ప్రకాష్ శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ పాపోలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందించారు.
