సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టత ఇచ్చింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు టీటీడీ కల్పించనుంది. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించింది టిటిడి. అదే రీతిలో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను ఎక్కువ మంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా SED టోకెన్లు కేటాయించనుంది. మిగతా 7 రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 25న శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *