సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస వర్షాల వల్ల పచ్చిమగోదావరి లో ఎర్రకాల్వ దానికి అనుబంధంగా భీమవరం పట్టణ నడిబొడ్డు నుండి ప్రవహించే యనదుర్రు కాల్వలో నీటి వరద ఉదృతి తీవ్ర స్థాయిలో పెరిగి గత 3 రోజులుగా భీమవరం ప్రజలను భయబ్రాంతుల్లకు గురి చేస్తుంది. పట్టణం వన్ టౌన్, మరియు 2 టౌన్ లను విడదీస్తూ ప్రవహించే యమదుర్రు ఇప్పుడు ఉగ్రరూపము తో ఎర్రటి వరద నీటితో అటు ఇటు గట్ల కు సమాంతరంగా ప్రవహిస్తుండటంతో ఎక్కడ గండి పడకుండా ప్రజలు అధికారులు అప్రమత్తము గా ఉన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకొన్నారు. భీమవరం పురపాలక సంఘ పరిధిలోని ముంపు ప్రాంతాలైన దుర్గాపురం, బీఎంకే రైస్ మిల్, బ్యాంక్ కాలనీ, మెంటేవారి తోట, మిరమియా కోడు, పసిమొగ్గల పాఠశాల ప్రాంతాల్లో.గత 3 రోజులుగా ఎప్పటికప్పుడు మోటార్లను ఏర్పాటు చేసి డీవాటరింగ్ ను ఇంజనీరింగ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు: దుర్గాపురంలో బి వి రాజు హై స్కూల్ మరియు మెంటేవారి తోటలో మీనాక్షి స్కూల్ మరియు GVR కాలేజ్ – మరియు స్థానిక ప్రవేటు స్కూల్స్ ను కూడా ప్రజా రక్షిత కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. వివరాలకు 📞 మున్సిపల్ కంట్రోల్ రూమ్: 08816-234284👤 ఓవరాల్ ఇన్‌చార్జి: అసిస్టెంట్ కమిషనర్ A. రాంబాబు📱 సెల్: 9849907154 ను సంప్రదించవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *