సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కలెక్టర్ మరియు భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, గౌరవ మిషన్ డైరెక్టర్, మెప్మా వారి సూచనల ప్రకారం బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు – 2026లో భాగంగా నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు భీమవరం పురపాలక సంఘ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మరియు ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వారోత్సవాల్లో నేడు, శనివారం ముగింపు భాగంగాఅసిస్టెంట్ కమిషనర్ ఏ. రాంబాబు ఆధ్వర్యంలో మెప్మా RPలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏడు ప్రధాన అంశాలపై అవగాహన కల్పించారు.1️⃣ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం.2️⃣ ఇంధనాన్ని ఆదా చేయడం.3️⃣ నీటిని పొదుపుగా వినియోగించడం. 4️⃣ సుస్థిర ఆహార విధానాలను పాటించడం.5️⃣ ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండటం.6️⃣ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం.7️⃣ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *