సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ ముగిసిన తదుపరి రోజే .. శివునికి ప్రతిపాత్రమైన నేడు,సోమవారం రోజునే ఆయనకు మరింత ఇష్టమైనదిగా పురాణాలూ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని శివాలయాలు వైష్ణవ ఆలయాలు విశేషంగా భక్తులతో వారు చేసే దీపారాధనలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని భీమవరం, పాలకొల్లు లో ఉన్న 2 పవిత్ర పంచా రామాలలో భక్తులు విశేషంగా దర్శనాలు చేసుకొంటూ దీపారాధనలు చేస్తున్నారు. నేడు భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసం మొదటి రోజు తెల్లవారు జామున 3 గంటల నుండి శ్రీ సోమేశ్వరునికి వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకం జరిగింది. భక్తులు విశేషంగా తరలి వచ్చారు. భక్తుల కోసం భారీ చలువ పందిళ్లు, భారీ క్యూ లైన్ ల బారికెట్స్ ఏర్పాటు చేసారు. మంచినీరు ప్రసాద వితరణ ఏర్పాట్లు చేసారు.. దూరప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులలో వచ్చే భక్తుల కోసం (ఒకే రోజు 5 పంచారామాలు దర్శనం) శ్రీ స్వామి దేవేరుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు, దీపారాధన కోసం చంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ చింతలపాటి బంగారు రాజు, ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *