సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 నెలలుగా పెద్దపులి సంచారం గురించి అది చేస్తున్న దాడుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ పులి తెలివిగా ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులకు దొరకలేదు. అయితే తాజగా ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వేలేరుపాడు మండలం నాళ్లవరం పంచాయతీ వద్ద పెద్దపులి సంచరిస్తుండటంతో చుసిన స్థానిక గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి తాజాగా జనావాసాలవైపు వస్తూ పశువులపై దాడి చేసింది. కొత్తూరు గ్రామ వాసి కరాటం బ్రహ్మయ్యకు చెందిన ఒక ఆవు, రెండు దూడలను పెద్దపులి దారుణం చంపేసింది. ఆయా సమీప గ్రామస్తులందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *