సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 1న పోలింగ్ బూట్ లలో తమ 70 వైసీపీ ఏజెంట్స్ ను బయటకు గెంటేసి ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ పులివెందుల మున్సిపల్ కార్యాలయం దగ్ధగ రర్నాకు దిగిన జగన్ ఫై పోలీసులు ఎన్నికలకు నిర్వహణను జగన్ అడ్డుకొంటున్నారని పెట్టిన కేసులో.. జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును కొట్టేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు.. నేడు, బుధవారం విచారణ జరిపిన జడ్జి జగన్ తదుపరి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు.. పులివెందుల అర్బన్‌ పోలీసులు జగన్‌పై నమోదుచేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన ఎంఈవో రఫిక్‌కు నోటీసులు జారీచేసింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *