సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు,శుక్రవారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు భక్తులతో భారీ క్యూ లైన్ లతో కిటకిటలాడాయి. విష్ణు కాలేజీ రోడ్డులోని, నరసయ్య ఆగ్రహం, ఉండి రోడ్డులోని పలు పాము పుట్టలు వద్ద మహిళలు విశేషంగా పూజలు నిర్వహించారు. శ్రీ రాంపురంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం గునుపూడి పంచా రామంలో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక దీపారాధనలతో ఆలయ పరిసర ప్రాంతాలు తెల్లవారు జామునుండి వెలుగులతో నిండిపోయాయి.నాగుల చవితి శ్రీ నాగేంద్ర స్వామికి మహిళలు నువ్వుల ఉండలు, చలివిడి, ఆవు పాలు, తెగలు, పెసరపప్పు భక్తి శ్రద్దలతో సమర్పించారు. దేవాలయ ఆవరణాలలో కార్తీక దీపారాధన శోభా కనిపించింది. మహిళలు తమ కుటుంబ ఆరోగ్యం, వంశ అభివృద్ధి, శ్రేయస్సు కోరుకొంటూ పూజలు చేసారు. కార్తీక మాసం నాగుల చవితి శుక్రవారం శ్రీ సోమేశ్వర స్వామి వారికి నేడు, శుక్రవారం లక్ష బిల్వ అర్చన అనంతర నాగేంద్ర భూషణుడుగా దివ్య దర్శనం ( ఫై తాజా చిత్రంలో )ఇచ్చారు. స్వామి వారి దేవస్థానంలో జరుగు అన్నప్రసాద వితరణకి స్థానిక భక్తులు పి వెంకటేశ్వరరావు 20,000 (అక్షరములా ఇరవది వెల రూపాయలు) కానుకగా సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *