సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామ క్షేత్రాలైన 5 పుణ్య క్షేత్రాల్లో సుమారు 180 కిలోమీటర్ల పాటు ఆదియోగి రథ యాత్ర నిర్వహించడం భగవత్ కృప అని, మన భీమవరం పట్టణం నుంచే ఆదియోగి రథ యాత్ర ప్రారంభించడం శివానుగ్రహమేనని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేటి శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఈనెల 25న భీమవరంలో ఈషా పౌండేషన్ అధ్వర్యంలో జరగనున్న ఆదియోగి రధ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈనెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేది వరకు భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లు – క్షీరారామం, ద్రాక్షారామం – ద్రాక్షారామం, పిఠాపురం – పాదగయ శక్తిపీఠం, సామర్లకోట కుమారారామం ఆలయం మీదుగా యాత్ర సాగుతుందన్నారు. ఈ యాత్రలో భక్తుందరూ పాల్గొనాలని అన్నారు. ఈషా పౌండేషన్ వాలంటీర్లు మాట్లాడుతూ.. ఈనెల 25న ఉదయం ఎస్ ఆర్ కే ఆర్ కళాశాల నుంచి సోమేశ్వర స్వామి ఆలయం వరకు రథయాత్ర జరుగుతుందని, సాయంత్రం ఆలయంలో శివాంగ స్పూర్తి, కైలాస వాద్యం, భైరవి దివ్య పూజ కార్యక్రమాలు జరుగుతాయని, 26న భీమవరం నుంచి పాలకొల్లు వైపుగా రథ యాత్ర సాగుతుందని అన్నారు. సుమారు 180 కిలో మీటర్ల రథ యాత్ర 60కి పైగా గ్రామాలు, పట్టణాలకు ఆదియోగి అనుగ్రహాన్ని అందిస్తూ రథం ముందుకు సాగుతుందన్నారు. ఈ యాత్ర భీమవరం సోమారామ క్షేత్రం నుంచి ప్రారంభమై సామర్లకోట లోని కుమారారామ క్షేత్రం వద్ద ముగుస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *