సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో ఏకైక చైర్‌పర్సన్ పదవి మరియు 52 వార్డుల వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి స్థానిక మున్సిపాలిటీ లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేటి బుధవారంతో ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. చైర్‌పర్సన్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 349 నామినేషన్లు దాఖలు కాగా, 7 నామినేషన్లు తిరస్కరించబడి, 342 నామినేషన్లు చెల్లుబాటుగా ప్రకటించబడ్డాయి. అయితే మరో 8 మంది కౌన్సిలర్ అభ్యర్థులు స్వచ్చందంగా నేడు, బుధవారం తమ నామినేషన్స్ ఉపసంహరించుకొన్నారు. రేపు కూడా ఉపసంహరణ గడువు ఉంది. భీమవరం ఎన్నికలలో చైర్‌పర్సన్ పదవి కి మొత్తం 9 మంది అభ్యర్థుల నామినేషన్స్ దాఖలు కాగావాటిలో ఒక్క ఇండిపెండెట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరింపబడింది. ఇక బరిలో ఉన్న 334 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్స్ వివరాలు పరిశీలిస్తే.. 🔸 భారతీయ జనతా పార్టీ (BJP) – 32 అభ్యర్థులు 🔸 సీపీఐ (CPI) – 1 🔸 సీపీఎం (CPM) – 3 🔸 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 10 🔸 తెలుగుదేశం పార్టీ (TDP) – 62 🔸 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) – 86 🔸 జనసేన పార్టీ – 68 🔸 స్వతంత్ర అభ్యర్థులు – 72 నామినేషన్స్ ఆమోదింప బడ్డాయి.
