సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నో వివాదాలు, ఆరోపణలు మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఒక్క అల్లూరి.. జిల్లా పరిషత్తు చైర్మెన్ గా వైసీపీకి చెందిన వంతల శాంతి ఎన్నిక, మినహా మిగతా 27 పదవులు కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం . జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో తెలుగుదేశం పార్టీ 22, జనసేన పార్టీ 4, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. దీంతో మొత్తం 27 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు కూటమి ఖాతాలో చేరాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *