సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గత 2 ఏళ్ళు పైగా సుదీర్ఘ కాలంగా షూటింగ్ పూర్తీ చేసింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల సినిమా ముందు ప్రకటించిన డిసెంబర్ 4న రాకపోవచ్చని ప్రచారం జరగగా, చిత్ర బృందం తాజాగా అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 25న ట్రైలర్‌ను విడుదల చేసి, ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అగ్ర దర్శకుడు, సుకుమార్ కథ అందించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో, స్పెషల్ ఎఫిక్ట్స్ భారీ సెట్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *