సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు, శుక్రవారం భీమవరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ, తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. నిన్న నిర్వహించిన భీమవరం మున్సిపల్ ఎన్నికలలో స్థానిక ప్రజలు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులకు పట్టం కట్టనున్నారని 30వ తేదీన జరిగే ఎన్నికల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ చండూరి మల్లేశ్వరి కౌన్సిలర్ అభ్యర్థులు 52 మంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించినున్నారన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ఇందుకూరి రామలింగరాజు, ఏపీ కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, పట్టణ టిడిపి అధ్యక్షుడు మద్దుల రాము ,మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ముఖ్య నాయకులు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన 37వ వార్డ్ కౌన్సిలర్ పోత్తూరి భాపిరాజును,అభినందించారు. ఈ సమావేశంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ , సీనియర్ మాజీ కౌన్సిలర్ విజ్జురోతు రాఘవులు,చెల్లబోయిన గోవింద్ కోళ్ల సీతారాం పాలా శ్రీరామదాసు పడమట సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *