సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను నిన్న శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావం ఓ మోస్తరుగా శ్రీకాకుళం జిల్లాపైనే కనిపించింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు కాలేదు. మొత్తంగా జవాద్‌ తుపాను ప్రభావం భయపెట్టినంతగా మన తీరంపై ప్రభావం చూపకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తుపాను బలహీనపడి ఒడిశా వైపు మరల నేటి ఆదివారం పశ్చిమబెంగాల్ వైపు కదలడంతో మన తీరంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *