సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు పాన్ ఇండియా రేంజ్ లో స్వర్ణయుగం ప్రారంభమయింది. మరి పాన్ ఇండియా సినిమా కు ఆద్యుడు సూపర్ స్టార్ కృష్ణ .. తెలుగు సినిమాను ఆంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కృషి చేసి సాంకేతికంగా అన్నింటా గొప్ప విజయాలు అందుకొన్న నిజమైన తెలుగు బాహుబలి .. సూపర్ స్టార్ కృష్ణ.. మరి ఇటీవల ఆయన తనయుడు, మహేష్ బాబు .. పోకిరి 4కే సినిమాతో రీరిలీజులకు కోట్ల రూపాయల సంపాదనకు టాలీవుడ్ కు దారి చూపింది. ఇటీవల పవర్ స్టార్ ‘జల్సా’ 4 కే రీరిలీజ్ రూ. 3.2 కోట్లు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బిల్లా’ సైతం 4కె‌లో అతడి పుట్టినరోజున సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇక తెలుగు తెరపై అన్నింటా ప్రథముడు సూపర్‌స్టార్ కృష్ణ 36 ఏళ్ళ క్రితం నటించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాసనం’ తోలి 70ఎం ఎం , 6ట్రాక్ స్టీరియో పోనిక్ సౌండ్ సిస్టం సైతం లేటెస్ట్ టెక్నాలజీతో ఏకంగా ఇండియా లో తొలిసారి 8కే రిజల్యూషనల్ క్వాలిటీ తో భారీ ఎత్తున 2023 జనవరిలో రీరిలీజుకు రెడీ అవుతుండడం విశేషం. హిందీ, తెలుగు ద్విభాషా చిత్రంగా పద్మాలయ బ్యానర్ పై కృష్ణ స్వీయ దర్శకత్వంలో, హీరోగా ద్విపాత్రాభినయనంతో అపట్లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. జయప్రద, మందాకిని, రాధ కథానాయికలుగా నటించగా.. వహిదా రహమాన్, త్రిపురనేని మహారధి, గుమ్మడి, సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే హిందీ నుండి మందాకినీ, ,అంజాద్ ఖాన్ నటుడిగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ‘బప్పీలహరి’సంగీత దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే రాజ్‌సీతారామ్ గాయకుడిగా ఇదే చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికి పెళ్ళిబ్యాండ్ లో వినపడుతూనే ఉంటాయి. అంతటి మ్యూజికల్ హిట్ గా చరిత్రలో నిలిచిపోయింది ‘సింహాసనం’. అలాంటి ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులకు 8Kతో సరికొత్త అనుభూతిని ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచన. మరి ఈ సినిమా రిరిలీజ్ లో కృష్ణ, మహేష్ అభిమానుల అండతో ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేయనుందో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *