సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరములో ‘గడప గడపకు మన ప్రభుత్వ’ కార్యక్రమం పై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లకు , ఎంపీడీవోలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు యొక్క అవసరాలు తెలుసుకొని వాటినివెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఆమె తెలిపారు. ప్రతి సచివాలయానికి ప్రజలు సూచించిన పనులు వెంటనే చేపట్టేందుకు 20 లక్షల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు. ఈ నిధులను వినియోగించుకొని మంచినీటి సరఫరా , రోడ్లు, డ్రైన్ లు , విద్యుత్ సదుపాయాలు వంటి పనులు చేపట్టేందుకు సంబంధిత నియోజకవర్గం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రతిపాదనలు, అంచనాల రూపొందించి పంపించాలని కలెక్టర్ సూచించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనులు ఏ విధంగా అప్లోడ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపల్ కమిషనర్లు , ఎంపీడీవోలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.ఈ సమావేశంలో సి పి కె. శ్రీనివాసరావు , డి ఎల్ డి ఓ
సి హెచ్ అప్పారావు , మున్సిపల్ కమిషనర్లు , మండల అభివృద్ధి అధికారులు. , డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *