సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన పూర్వికులు చాల తెలివైనవాళ్లు.. ముందుతరాలకు కారణం లేకుండా ఏది చెప్పరు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో తేలింది. దేశంలో డబ్బు సంపాదన లక్ష్యంతో మానసిక వత్తిడి తో ఎక్కువ శాతం మంది ప్రజలకు బోనస్ గా వచ్చే షుగర్ వ్యాధి (మధుమేహ రోగులకు) కి చవక ధరకు దొరికే ఉల్లిపాయ విరుగుడు అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది.
