సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు –రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళికి సరెండర్ అవుతారు మహేశ్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేసినట్లు, ఒకటి అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ కథ అనుకున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమా లైన్ గురించి మీడియాకు చెప్పారు. ‘‘ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసే సాహస హీరో కథ ఇది. పక్కా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా, ద్రిల్స్ తో ఉంటుంది. ఇందులో మహేశ్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. జేమ్స్ బాండ్ పాత్రకు ఏ మాత్రం తగ్గదు ’’ అని ప్రకటించారు. అంటే మహేష్ ప్యాన్స్ కు అర్ధం అయిపోయింది కదా ! ఈ సారి హాలీ వుడ్ రికార్డ్స్ ను కూడా బ్రద్దలు కొట్టడానికి “క్షణ క్షణం” నిర్మాతలు డాక్టర్ కే ఎల్ నారాయణ, లక్ష్మణ చౌదరి 800 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాకువరల్డ్ వైడ్ సినిమాకు రాజమౌళి సిద్ధం అవుతున్నాడని.. ఇక హాలీవుడ్ హీరోగా మహేష్ బాబు ప్రక్క రాసిపెట్టుకోండి..
