సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, భీమవరం ఆధ్వర్యంలో నేడు, శనివారం రేపు ఆదివారం (18 తేదీలలో) స్థానిక అంకాల ఆర్ట్ అకాడమీ హాలు నందు ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనను ఈ రోజు ఉదయం జిల్లా విద్యా శాఖాధికారి, శ్రీ ఆర్.వి. రమణ ప్రారంభించారు. గౌరవ అతిథిగా వచ్చిన ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్, స్వాతంత్ర్యయోధుల వీర గాధలను వివరించారు. విశేషంగా స్కూల్ విద్యార్థులు ఎగ్జిబిషన్ లోని ఫోటోలను సందర్శించారు. జిల్లా విద్యా శాఖాధికారి ఆర్.వి. రమణ మాట్లాడుతూ.. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మనదేశ చరిత్రను తెలుసుకోవడం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుల జీవితగాధలను తెలుసుకొని, దాని నుండి స్ఫూర్తి పొంది, ప్రతి విద్యార్థి కూడా మంచి పౌరులుగా తయారు కావాలని, దేశం కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన విద్యార్థులను కోరారు. ఇన్ని వందల స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలను ఈరోజు ప్రదర్శించడం చాలా గొప్ప కార్యక్రమమని , నిర్వాహకులు ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ని అభినందించారు. కార్యక్రమ కన్వీనర్ ముహమ్మద్ సిద్దిఖ్ గారు మాట్లాడుతూ…ఇప్పటికే దేశవ్యాప్తంగా 43 ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించి, అల్లూరి సీతారామ రాజు లాంటి గొప్ప మహానుభావులు కృషిచేసిన మన భీమవరం లాంటి గడ్డలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము అన్నారు.
