సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు దసరా వేడుకలలో భాగంగా నేడు, మంగళవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి మనోహర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. ఆలయ ఆవరణలో ప్రజలకు సుఖ శాంతులు కోరుకొంటూ వేదమంత్రాలతో చండి హోమము నిర్వహించారు. ఆలయ కళా వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం నుండి రాత్రి 9గంటల వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు నిర్వహిస్తున్నారు. ఫై తాజా చిత్రంలో శ్రీ అమ్మవారి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం చూడవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *