సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాల టీచర్ల కు ప్రమోషన్లు ఎంపిక చేసే షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ , జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లోపనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్ , గ్రేడ్–2 హెడ్మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూ ల్ అసిస్టెంట్స్ ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7వ తేదీన వెబ్ సైట్ లలో ప్రకటిస్తారు. వీటిపై ఉన్న అభ్యంతరాలను online ద్వారా ఈ నెల 8వ తేదీలోగా తెలపాల్సి ఉంటుంది. వచ్చి న ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఈ నెల 9వ తేదీన పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను 10న విడుదల చేస్తారు. గ్రేడ్–2 పోస్టుల ప్రమోషన్లను ఈ నెల 11న, స్కూ ల్ అసిస్టెంట్లు దానికి సమానమైన ఇతర పోస్టుల పదోన్నతులను ఈనెల 12, 13 తేదీలలో ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *