సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కీలక సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి లోని మాగంటి కల్యాణమండపం లో నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. .రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. దీనిలో తెలుగు దేశం పార్టీ కీలకనేతలు , ఉమ్మడి జిల్లా ఇంచార్జిలు, జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లు ఇతర గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్దస్థాయిలో హాజరు అవుతారని భావిస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 19 నెలలు లో ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇకపై పార్టీ ప్రజలలో చొచ్చుకొనిపోవడానికి అనుసరించవలసిన ప్యూహాలు, ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,ఒకవేళ జనసేన తో పొత్తు ఉంటె త్యాగాలకు ఏఏ ప్రాంత నేతలు సిద్ధంగా ఉండాలో?అసలు పొత్తు ఏమాత్రం లాభదాయకం? కూడా క్యాడర్ అభిప్రాయాలు తీసుకోని అధిష్టానానికి విజ్ఞప్తి చేసేందుకు ముందుగానే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. up file photo
