సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు కార్యాలయంలో నేడు, శుక్రవారం DRDA జిల్లా సమాఖ్య కమిటీ కి నూతనంగా ఎన్నికయిన మహిళా సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిలో DRDA జిల్లాఅధ్యక్షులు గా ఎన్నికైన పళ్లెం అరుణ కుమారి ( ఆకివీడు) దాసరి ప్రవీణ ఉపాధ్యక్షులు( పెంటపాడు) V. కమలారెడ్డి, కార్యదర్శి ( ఉండి) మారంపూడి జాజి కుమారి కోశాధికారి ( బొబ్బనపల్లి) లకు మరియు కమిటీ సబ్యులకు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని , మీకు వచ్చిన పదవుల కు గౌరవం పెంచేలా కస్టపడి పనిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *