సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫై బీజేపీ ఎదురుదాడి తీవ్రతరం చేసింది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేదని సంజయ్ నేడు, శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూ.. తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిజాయితీ నిరూపించుకోవడానికి.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. మరోవైపు తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో పోలీసులు అరెస్ట్ చేసిన స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర , నందకుమార్ల కు పోలీస్‌లు కోరిన రిమాండ్‌కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తిరస్కరించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ) 41ఏ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సూచించారు. విచారణ రేపటికి వాయిదా వేశారు
