సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జగన్ సర్కర్ తీసుకొన్న 3 రాజధానుల అభివృద్ధి వికేం ద్రీకరణతోనే అన్ని ప్రాం తాలకు న్యా యం జరుగుతుం దని, కర్నూ లులో న్యా య రాజధాని ఏర్పా టు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని నేడు, శనివారం తిరుపతి లో స్థానిక ప్రజల, రాజకీయ నేతల , విద్యార్థి సంఘలు, ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యో గులు, వ్యా పారులతోపాటు మేధావులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మరియు తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో ఆత్మ గౌరవ గర్జన, రాయలసీమ ఆత్మ గౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరం ప్రధాన రహదారులు అంత జనమే.. జనం తో నిండిపోయింది. మహార్యాలీ నుద్దేశించి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమను రత్నాల సీమగా మార్చాలని సీఎం జగన్ చూస్తుంటే .. రాయలసీమ ద్రోహి చంద్రబాబు ఇక్కడి ప్రజలు అభివృద్ధికి గతం నుండి అడ్డుపుల్లలు వేస్తున్నాడని, ఇప్పుడు కర్నూల్ కు హైకోర్టు వస్తుందంటే అడ్డుకొంటున్నాడంటే ప్రజలు క్షమించరన్నారు. ఇక రాయలసీమ న్యాయరాజధాని చేయడం ద్వా రా మన ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి సాధించవచ్చు. దీనికోసం సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. (ర్యాలీలో జనసంద్రాన్ని ఫై తాజా ఫొటోలో..)
