సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు, శనివారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు భక్తులతో భారీ క్యూ లైన్ లతో కిటకిటలాడాయి. గునుపూడి పంచా రామంలో అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక దీపారాధనలతో ఆలయ పరిసర ప్రాంతాలు తెల్లవారు జామునుండి వెలుగులతో నిండిపోయాయి.నాగుల చవితి శ్రీ నాగేంద్ర స్వామికి మహిళలు నువ్వుల ఉండలు, చలివిడి, ఆవు పాలు, తెగలు, నీటిలో నానిన పెసరపప్పు భక్తి శ్రద్దలతో సమర్పించారు. దేవాలయ ఆవరణాలలో కార్తీక దీపారాధన శోభా కనిపించింది. ( ఫై చిత్రం మారుతి సెంటర్ లో..) అలాగే నరసయ్య అగ్రహారం, విష్ణు కాలేజీ రోడ్డు, జేపీ రోడ్డు లోని గణేష్ క్యాంటిన్ ప్రక్కన, పొలాలలో ఉన్న పాము పుట్టలకు పలుచోట్ల మహిళలు విశేషముగా ముగ్గులు వేసి పసుపు కుంకుమలు సమర్పించి ఆవుపాలు ను పుట్టలో పోసి క్రోడి గుడ్లను ఉత్సహంగా, తమ ఆరోగ్యం, వంశ అభివృద్ధి , శ్రేయస్సు కోరుకొంటూ సమర్పించడం జరిగింది.
