సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రతిష్టాకర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ AP NITలో గతంలో పలు వివాదాస్వాద ఘటనలు జరిగి వార్తలలో ఉండేది. దానితో ర్యాగింగ్ ఫై కఠిన చర్యలు , స్కాములలో కఠిన నిర్ణయాలు, బదిలీలు మార్పులు చేర్పులు జరిగాక గత కొంతకాలంగా పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఇటీవల విద్యార్థినులపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.. బయోటెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తమిళ మణి విద్యార్థినుల పట్ల వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులంతా కలిసి గత శుక్రవారం పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. ఆ ఫ్యాకల్టీని విధుల నుంచి తప్పించాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. దీంతో “నిట్” క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ అధికారులు వారితో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఫ్యాకల్టీ తమిళ మణి వేధింపులపై విద్యార్థినులు ఫిర్యాదు ను నమోదు చేసారు. పరిస్థితి చేయిదాటుతుందని గమనించి విద్యారులు చే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యాకల్టీ తమిళ మణిని విధుల నుంచి తొలగించినట్టు తాజాగా నిట్ బోర్డు ప్రకటించింది.దీనితో విద్యార్థులు ఆందోళన విరమించారు.
